NTTF: 2030 నాటికి విద్యార్థుల ఆత్మహత్యలు 10% తగ్గించాలానే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ..! 6 d ago

ఐఐటీ-ఢిల్లీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థలలో తరచూ జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి, విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి సంబంధించి పరిష్కరించడానికి ఓ జాతీయ టాస్క్ ఫోర్సు (ఎన్టీటీఎఫ్)ను ఏర్పాటు చేయాలని న్యాయస్థానం అధికారులకు జస్టిస్ జె బి పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. నాలుగు నెలల వ్యవధిలో మధ్యంతర నివేదికను, ఎనిమిది నెలల వ్యవధిలో తుది నివేదికను ఎన్టీఎఫ్ అందజేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.
రాష్ట్రాల ఉన్నత విద్యా శాఖ, సామాజిక న్యాయ, న్యాయ వ్యవహరాలు, సాధికారత, మహిళా, శిశు అభివృద్ధి శాఖల కార్యదర్శులు విద్యార్థుల ఆత్మహత్యకు కారణాలు గుర్తించడం, ప్రస్తుతం ఉన్న నిబంధనలను విశ్లేషించడం, వారి రక్షణను బలోపేతం చేసేందుకు సిఫారసులు సహా సమగ్ర నివేదికను ఎన్టీటీఎఫ్ రూపొందిస్తుంది. దీనికోసం ఏ ఉన్నతవిద్యా సంస్థనైనా ఆకస్మికంగా తనిఖీ చేసే అధికారం ఎన్టీఎఫ్ కు ఉంటుంది.
NCRB 2022 నివేదిక ప్రకారం, 2022లో దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యలలో విద్యార్థుల ఆత్మహత్యలు 7.6%గా ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో (2012-22) విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 6,654 నుండి 13,044కి పెరిగింది. మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలలో అత్యధికంగా విద్యార్థుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. చదువు పై అసంతృప్తి, తీవ్రమైన ఒత్తిడి మరియు పరీక్షల్లో ఫెయిల్ అవడం. బెదిరింపులు, ర్యాగింగ్ మరియు కుల, జాతి, లింగ, వివక్ష మరియు లైంగిక వేధింపులు మొదలైనవి. ఆన్లైన్ లో బెట్టింగ్ ల కోసం అప్పులు చేయడం మరియు ఆన్లైన్ గేమింగ్. భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించిన అంశాల పై వారి అవగాహణాలను అర్థం చేసుకోవడంలో సహకరించేందుకు విద్యా మంత్రిత్వ శాఖచే ప్రారంభించబడింది. ఆత్మహత్యలను నివారించేందుకు డ్రాఫ్ట్ UMMEED (అండర్ స్టాండ్, మోటివేట్, మేనేజ్, ఎంపతైజ్, ఎంపవర్ అండ్ డెవలప్) పాఠశాలలకు మార్గదర్శకాలు. 2030 నాటికి ఆత్మహత్య మరణాలను 10% తగ్గించాలానే లక్ష్యంతో 2022లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MOHFW) ప్రారంభించింది.
సైకాలజిస్టులు, మానసిక వైద్యనిపుణులతో మానసిక సమస్యలు ఎదుర్కొనే టీనేజర్లకు సలహాలు, సూచనలతోపాటు కౌన్సెలింగ్ ను కూడా ఇప్పిస్తుంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో 844 844 0632 టోల్ నంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 24/7 టోల్-ఫ్రీ హెల్ప్ లైన్ ద్వారా మానసిక ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.